Breaking News

టాటా మోటార్స్‌ లాభం జంప్‌

Published on Fri, 08/02/2024 - 05:15

న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024–25, క్యూ1)లో బంపర్‌ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 74 శాతం జంప్‌ చేసి రూ. 5,566 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,204 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా దేశీ వాహన వ్యాపారంతో పాటు జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) పటిష్టమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది. 

మొత్తం ఆదాయం సైతం రూ. 1,03,597 కోట్ల నుంచి రూ. 1,09,623 కోట్లకు వృద్ధి చెందింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన (దేశీ కార్యకలాపాలు) క్యూ1లో కంపెనీ రూ. 2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 64 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్‌ ఆదాయం రూ. 16,132 కోట్ల నుంచి రూ. 18,851 కోట్లకు పెరిగింది. ఇక జూన్‌ క్వార్టర్‌లో జేఎల్‌ఆర్‌ ఆదాయం కొత్త రికార్డులను తాకింది. 5 శాతం వృద్ధితో 7.3 బిలియన్‌ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది.   
టాటా మోటార్స్‌ షేరు ధర 1 శాతం లాభపడి రూ.1,145 వద్ద ముగిసింది.  

కంపెనీ విభజనకు బోర్డు ఓకే... 
టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్‌ కంపెనీలుగా విడగొట్టే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ (టీఎంఎల్‌) నుంచి వాణిజ్య వాహన వ్యాపారాన్ని  టాటా మోటార్స్‌ సీవీగా విభజిస్తారు. ప్రస్తుత పీవీ వ్యాపారం టీఎంఎల్‌లో విలీనం అవుతుంది. విభజన తర్వాత టీఎంఎల్‌సీవీ, టీఎంఎల్‌ పేర్ల మార్పుతో పాటు రెండు వేర్వేరు లిస్టెడ్‌ కంపెనీలుగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 12–15 నెలలు పట్టొచ్చని వెల్లడించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)