Breaking News

టాటా  మోటార్స్‌ రివర్స్‌ గేర్‌ 

Published on Sat, 08/09/2025 - 04:39

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌ (క్యూ1)లో నికర లాభం 62% క్షీణించి రూ. 4,003 కోట్లను తాకింది. యూఎస్‌ టారిఫ్‌లతో జేఎల్‌ఆర్‌ లాభాలు తగ్గడం, అమ్మకాలు క్షీణించడం, అధిక బేస్‌ తదితర అంశాలు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 10,587 కోట్లు ఆర్జించింది. 

మొత్తం ఆదాయం సైతం రూ. 1,07,102 కోట్ల నుంచి రూ. 1,04,407 కోట్లకు నీరసించింది. గతంలో అంటే 2024 ఏప్రిల్‌లో పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ను టాటా క్యాపిటల్‌(టీసీఎల్‌)లో విలీనం చేయడంతో రూ. 8,016 కోట్ల టీసీఎల్‌ ఈక్విటీ షేర్లను అందుకుంది. తద్వారా రూ. 4,975 కోట్ల లాభం జమ చేసుకుంది. ఇది అధిక బేస్‌కు కారణం. 

జేఎల్‌ఆర్‌ తీరిలా: యూకే, ఈయూలో తయారైన కార్లపై యూఎస్‌ టారిఫ్‌ల కారణంగా  బ్రిటిష్‌ అనుబంధ కంపెనీ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) ఆదాయం 9% తగ్గి 6.6 బిలియన్‌ పౌండ్లకు పరిమితమైంది. టారిఫ్‌ల వల్ల జేఎల్‌ఆర్‌పై 25 కోట్ల పౌండ్ల ప్రభావం పడినట్లు టాటా మోటార్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో పీబీ బాలాజీ చెప్పారు. తదుపరి తరం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై 3.8 బిలియన్‌ పౌండ్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు జేఎల్‌ఆర్‌ సీఈవో అడ్రియన్‌ మార్డెల్‌ పేర్కొన్నారు. 
టాటా మోటార్స్‌ షేరు 2.2% క్షీణించి రూ. 633 వద్ద ముగిసింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)