ఈపీఎఫ్‌ఓ-టాటా మోటార్స్‌ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణ

Published on Mon, 07/29/2024 - 09:33

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగుల భవిష్య నిధిని ఈపీఎఫ్‌ఓకు బదిలీ చేసే అంశంపై చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. గతంలో కంపెనీ చెల్లించిన ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌ ఫండ్‌ను తిరిగి సంస్థ అకౌంట్‌లో జమ చేయాలని కోరుతుంది. అయితే సంస్థలోని ఉద్యోగులు, కంపెనీ ఆర్థికస్థితికి సంబంధించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ సమర్పించాలని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఆగస్టు 8న విచారణ జరగనుంది.

టాటా మోటార్స్ 2019-20, 2020-21, 2021-22 వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలను చవిచూసింది. దాంతో యాక్చురియల్ వాల్యుయేషన్(ఆస్తులు, ఖర్చులను పోల్చి చూసే విశ్లేషణ పత్రం) ద్వారా పెన్షన్ ఫండ్ చెల్లింపులను రద్దు చేయాలని కోరింది. 2019లో కంపెనీ మినహాయింపు పొందిన పెన్షన్ ఫండ్‌ను సరెండర్ చేయడానికి ఈపీఎఫ్‌ఓకు దరఖాస్తు చేసింది.

ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?

భవిష్య నిధికి సంబంధించిన కార్పస్ బదిలీకి ఈపీఎఫ్‌ఓ ​​అంగీకరించింది. కానీ, అధికారులు పెన్షన్ స్కీమ్ వివరాలను కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పెన్షన్ కార్పస్‌కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని అందించాలని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది. గతంలో కంపెనీ సమర్పించిన నగదు బదిలీని అనుమతించడానికి అవసరమయ్యే నిర్దిష్ట ఖాతాల సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ అంశం ఆగస్టు 8న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)