Breaking News

పదేళ్లలో ఫస్ట్‌టైమ్‌! టీసీఎస్‌ను మించిన మరో టాటా కంపెనీ..

Published on Sun, 05/19/2024 - 11:14

టాటా గ్రూప్‌లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.

2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో  టాటా మోటార్స్ టీసీఎస్‌ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్‌ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.

టాటా మోటర్స్‌ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది.  అయితే గ్రూప్‌లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్‌ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్‌ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)