Breaking News

టాటా గ్రూప్‌ కృష్ణకుమార్‌ కన్నుమూత

Published on Mon, 01/02/2023 - 08:54

ముంబై: రతన్‌​ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్‌లో పలు అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆర్‌ కృష్ణకుమార్‌(84) ఇక లేరు. ఆదివారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు.  

పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆర్‌ కృష్ణకుమార్‌.. కేరళ తలస్సెరీలో పుట్టిపెరిగారు. చెన్నైలో ఉన్నత చదువులు పూర్తి చేసి.. 1963లో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టారు. టాటా సన్స్‌కు డైరెక్టర్‌గానే కాదు, గ్రూప్‌లో పలు కంపెనీల టాప్‌ పొజిషన్‌లో ఆయన పని చేశారు. ట్రస్ట్‌ల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. టాటాలోని వివిధ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థ ఇండియన్‌ హోటల్స్‌కు హెడ్‌గానూ ఆయన పని చేశారు. దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.

టాటా సంస్థలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పలు కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. వ్యాపార కార్యనిర్వాహకుడిగానే కాకుండా.. దాదాపు ఒకే వయసు వాళ్లు కావడంతో రతన్‌ టాటాతో కృష్ణకుమార్‌కు మంచి అనుబంధం కొనసాగింది. సైరస్‌ మిస్ట్రీ తొలగింపు ఎపిసోడ్‌లో.. రతన్‌ టాటాకు కీలక సూచనలు చేసిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది.

ఇక కృష్ణకుమార్‌ మృతి టాటా గ్రూప్‌ స్పందించింది. టాటా సన్స్‌ ప్రస్తుత చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేరిట సంతాప ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్‌నకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అందులో చంద్రశేఖరన్‌ కొనియాడారు. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం కృష్ణకుమార్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబైలోని చందన్‌వాడీ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)