Breaking News

‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగం

Published on Tue, 08/27/2024 - 11:46

టాటా గ్రూప్ 4000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ఉత్పత్తుల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో పనిచేయడానికి ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళలకు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.

నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్‌), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏపీఎస్‌) ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తామని టాటా గ్రూప్‌ తెలిపింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి తెలియజేసింది. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి నేతృత్వంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు టాటా గ్రూప్‌ పేర్కొంది. ఈ డ్రైవ్‌లో ఎంపికయ్యే మహిళలు తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని కోలార్‌ ప్లాంట్లపై టాటా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఇదీ చదవండి: డెబిట్‌ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా

ఎన్‌ఏపీఎస్‌లో దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 10, 12వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు ఎన్‌ఏటీఎస్‌కు అర్హులని కంపెనీ తెలిపింది. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారిని షాప్ ఫ్లోర్ టెక్నీషియన్లుగా నియమిస్తారు. నిర్ణీత వేతనంతో పాటు అభ్యర్థులకు వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తామని టాటా గ్రూప్‌ ప్రకటించింది. ఇదిలాఉండగా, త్వరలో కంపెనీలో చేరబోయే నాలుగు వేలమంది మహిళలతో టాటా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఉత్పత్తులు పెరిగి మార్కెట్‌ డిమాండ్‌ తీరుతుంది. ఫలితంగా కంపెనీ రెవెన్యూ అధికమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)