Breaking News

టాటా కన్జూమర్‌ చేతికి 2 సంస్థలు

Published on Mon, 01/15/2024 - 00:53

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) తాజాగా క్యాపిటల్‌ ఫుడ్స్‌తోపాటు, ఆర్గానిక్‌ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్‌ప్రైజ్‌ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్‌ ఫుడ్స్‌లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ కంపెనీ తెలియజేసింది. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్‌ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.

పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్‌ ఫుడ్స్‌ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్‌ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్‌ వెల్లడించింది. ఇక ఫ్యాబ్‌ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్‌ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్‌ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్‌ సప్లిమెంట్స్, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌ తదితర ఆర్గానిక్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్‌ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్‌ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)