Breaking News

టీసీఎస్‌.. భారీగా లే ఆఫ్స్‌.. ఎవరిపై ప్రభావమంటే..!

Published on Sun, 07/27/2025 - 18:33

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) భారీ లే ఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కారణంగా భారీ తొలగింపునకు టీసీఎస్‌ సన్నద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల‍్లో 2 శాతం లే ఆఫ్స్‌ కు సిద్ధమైన విషయాన్ని కంపెనీ ఆదివారం స్పష్టం చేసింది. 

అంటే 12వేలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోనన్నారు. ఇది మధ్యస్థంగా ఉన్న ఉద్యోగులతో పాటు సీనియర్‌ స్థాయిల్లో ప్రభావం చూపే అవకాశం  ఉందని టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కె కృతివాసన్‌ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే మారిన టెక్నాలజీతో తొలగింపులు తప్పడం లేదన్నారు.

కొత్త టెక్నాలజీల పరంగా చూస్తే ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో  ఉన్నాం. 

మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో లే ఆఫ్స్‌ తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో  ఉండే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం అనుకున్నంత ఈజీ కాదు. సీఈఓగా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటి’ అని కృతివాసన్‌ తెలిపారు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)