Breaking News

రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?

Published on Fri, 01/24/2025 - 08:06

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్‌ ఎస్టేట్స్, ఇన్‌ టాండెమ్‌ గ్లోబల్‌ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.

‘భారత రియల్‌ ఎస్టేట్‌(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.

‘ఉపాధి కల్పనలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్‌ కాలర్‌ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్‌టాండెమ్‌ గ్లోబల్‌ కన్సల్టెంగ్‌ ఎండీ శర్మిష్ట ఘోష్‌ 
అభిప్రాయపడ్డారు.
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)