Breaking News

హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ఏఐ జీసీసీ ప్రారంభం

Published on Thu, 03/13/2025 - 14:18

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ ఇన్నోవేషన్‌లో సేవలందిస్తోన్న సినెరిక్ గ్లోబల్ హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక ఏఐ ఉత్పత్తులు, సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో కంపెనీ 150 మిలియన్‌ డాలర్లు(సుమారు  రూ.1300 కోట్లు) ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. జీసీసీ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.

‘ఏఐ ఆధారిత ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్‌కు ప్రాముఖ్యత పెరుగుతోంది. కోడింగ్ హబ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఎగుమతి చేసే కేంద్రంగా నగరం పరివర్తన చెందింది. హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏర్పాటు చేసి, స్థానికంగా ఏఐ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ కంపెనీలరాక ప్రోత్సాహకరంగా మారింది’ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

సినెరిక్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుధాకర్ పెన్నం మాట్లాడుతూ.. టెక్నాలజీ పరంగా సినెరిక్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నిబద్ధతను తెలియజేస్తూ, హైదరాబాద్ ప్రగతిశీల ఏఐ విధానాలను నొక్కి చెప్పారు. ‘కంపెనీ 150 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించడానికి హైదరాబాద్‌లోని కొత్త జీసీసీ కీలకం కానుంది. స్థానికంగా బలమైన టాలెంట్ పూల్‌ను నిర్మిస్తూనే, తదుపరి తరం ఏఐ టెక్నాలజీలను ఆవిష్కరించడం, ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌ప్రైజెస్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. ‍జీసీసీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మెర్జెన్ గ్లోబల్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ.. సినెరిక్ గ్లోబల్ జీసీసీ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ అవసరాలను తీర్చే అత్యాధునిక ఆవిష్కరణలను అందించడంలో కీలకంగా మరనుందని చెప్పారు.

ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఛార్జీలు ఇలా..

గ్లోబల్ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్ మార్కెట్ 2028 నాటికి 10% సీఏజీర్‌తో పెరిగి 65.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, సేల్స్‌ఫోర్స్‌ ఆటోమేషన్ 2027 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని  మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత వర్క్ ఫ్లో ఆటోమేషన్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో సర్వీస్ నౌ మార్కెట్ 22.5 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా. 2025 చివరి నాటికి 23.76 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి చెందుతున్న విభాగాలకు అనుగుణంగా వ్యాపారాలకు సృజనాత్మక, ఇంటిగ్రేటెడ్ పరిష్కారాలను అందించడానికి సినెరిక్ గ్లోబల్ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)