Breaking News

ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్‌’

Published on Thu, 10/24/2024 - 11:41

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్‌’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్‌’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్‌ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు ఈ స్విగ్గీసీల్‌ బ్యాడ్జ్‌ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్‌లో ఆడిట్‌ నిర్వహించేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్‌ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్‌’ తయారీదారు!

వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్‌ గుర్తింపు తీసుకున్న ఫుడ్‌ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్‌ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)