Breaking News

‘సింగం ఎగేన్‌’ టీమ్‌తో కలిసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

Published on Tue, 10/15/2024 - 09:54

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్‌లో ఏకంగా 11,000 వడాపావ్‌ను డెలివరీ చేసి ఈ రికార్డ్‌ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్‌’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్‌హుడ్‌ ఆర్మీ’ అనే ఎన్‌జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.

స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్‌ఎల్‌’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్‌’ ఫేమ్‌ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్‌లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్‌జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్‌పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌ సేవలకు డేట్‌ ఫిక్స్‌

ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్‌లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్‌ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్‌ సినిమా టీమ్‌తోపాటు రాబిన్‌హుడ్‌ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్‌ఎల్‌ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)