Breaking News

స్విగ్గీ చేతికి లింక్స్‌ లాజిస్టిక్స్‌

Published on Fri, 07/14/2023 - 06:25

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రిటైల్‌ పంపిణీ సంస్థ లింక్స్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌(లింక్‌)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ వెల్లడించింది. షేర్ల మారి్పడి ద్వారా రామ్‌కో సిమెంట్స్, రామ్‌కో ఇండస్ట్రీస్‌ నుంచి లింక్‌ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి టెక్నాలజీ ఆధారిత పంపిణీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా దేశీ ఫుడ్, గ్రోసరీ రిటైల్‌ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు వివరించింది.

మరోవైపు లింక్స్‌ లాజిస్టిక్స్‌లో తమకున్న 49.95 శాతం వాటాను బండెల్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(స్విగ్గీ మాతృ సంస్థ)కు విక్రయించనున్నట్లు రామ్‌కో సిమెంట్స్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా బండెల్‌ టెక్‌కు చెందిన కచ్చితంగా మారి్పడి చేసుకోవలసిన 24,18,915 ప్రిఫరెన్స్‌ షేర్ల(సీసీపీఎస్‌)ను పొందనున్నట్లు పేర్కొంది.

ఇదేవిధంగా రామ్‌కో ఇండస్ట్రీస్‌ సైతం లింక్స్‌లోగల 46.15 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసేందుకు బండెల్‌ టెక్‌తో షేర్ల సబ్‌్రస్కిప్షన్, కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్‌ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనికి బదులుగా బండెల్‌కు చెందిన 22,35,223 సీసీపీఎస్‌లను పొందనున్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా కొనుగోలు తదుపరి లింక్‌ సహవ్యవస్థాపకుడు, సీఈవో శేఖర్‌ భెండే అధ్యక్షతన స్వతంత్ర బిజినెస్‌ యూనిట్‌గానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

Videos

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)