Breaking News

ఇది కదా రికార్డ్ అంటే!.. ఏకంగా కోటి..

Published on Thu, 01/08/2026 - 17:44

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. తన గురుగ్రామ్ ప్లాంట్ నుంచి 10 మిలియన్ల (కోటి) ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసి.. ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ దేశంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయాన్ని వెల్లడించింది.

కంపెనీ మొదటి 5 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయడానికి.. 14 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత ఆరేళ్లలో మరో 5 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే.. క్రమంగా కంపెనీ వాహనాలను డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీ తన ఉత్పత్తిని కూడా పెంచాల్సి వచ్చింది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అమ్మకాలు పెరగడానికి యాక్సెస్ 125 వెన్నెముకగా నిలిచింది. ఆ తరువాత జాబితాలో బర్గ్‌మాన్ స్ట్రీట్, అవెనిస్ వంటి ఇతర స్కూటర్లు, అలాగే జిక్సర్ 150/250 సిరీస్, అడ్వెంచర్ ఓరియెంటెడ్ V-స్ట్రోమ్ SX కూడా సంస్థ పురోగతికి చాలా ఉపయోగపడ్డాయి.

సుజుకి మోటార్‌సైకిల్ ప్రస్తుతం 1,200 కంటే ఎక్కువ అమ్మకాలు & సేవా టచ్‌పాయింట్‌లను కలిగి ఉన్నారు. అంతే కాకుండా 60 కంటే ఎక్కువ దేశాలకు.. భారతదేశంలో నిర్మించిన మోడళ్లను ఎగుమతి చేస్తోంది. భవిష్యత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి, కంపెనీ హర్యానాలోని ఖార్ఖోడాలో రెండవ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందని సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)