Breaking News

జీతం తక్కువైనా చాలు.. కానీ..

Published on Mon, 05/26/2025 - 14:21

జీవన వ్యాయాలు పెరిగిపోతున్న తరుణంలో వేతన జీవుల అంచానాలు, ఆకాంక్షలు మారిపోతున్నాయి. 74 శాతం మంది ఉద్యోగులు వేతనాల కంటే కూడా బలమైన దీర్ఘకాలిక ప్రయోజనాలతో కొంచెం తక్కువ వేతనానికి మొగ్గుచూపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది.

హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ సపోర్ట్ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు బదులుగా కొంచెం తక్కువ వేతనాన్ని ఎంచుకుంటామని సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 74 శాతం మంది పేర్కొన్నట్లు స్టాఫింగ్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది.

జీనియస్ కన్సల్టెంట్స్ దేశవ్యాప్తంగా 1,139 మంది ఉద్యోగుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం కేవలం 32 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ ప్రస్తుత ప్రయోజనాల ప్యాకేజీ తమ ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడుతుందని భావించగా, 61 శాతానికి పైగా తమ ప్రయోజనాలు సరిపోవని చెప్పారు.

తమ యాజమాన్యాలు ఉద్యోగుల మానసిక, ఆర్థిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని 54 శాతం మంది చెప్పారు. హైబ్రిడ్ లేదా రిమోట్ అరేంజ్మెంట్స్ వంటి సౌకర్యవంతమైన పని ఎంపికలు ​​తమకు ఆర్థికంగా కొంతమేర ఊరట కల్పిస్తాయని 84 శాతం మంది పేర్కొన్నారు.

పనితీరు ఆధారిత బోనస్‌లు, ప్రోత్సాహకాలు వారి ప్రస్తుత ఆర్థిక ఆందోళనలను గణనీయంగా తగ్గిస్తాయని 73 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇది వ్యక్తిగత పనితీరుకు ప్రతిఫలం ఇచ్చే, ఆదాయ అంతరాలను పూడ్చడానికి సహాయపడే వేరియబుల్ పరిహారానికి పెరుగుతున్న ప్రాధాన్యతను వెల్లడించింది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)