Breaking News

ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులు

Published on Tue, 08/06/2024 - 16:34

గుజరాత్‌లోని సూరత్‌లో వున్న ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ కిరణ్ జెమ్స్ తన 50000 మంది ఉద్యోగులకు 10 రోజులు (ఆగస్టు 17 నుంచి 27 వరకు) సెలవును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్‌ను అధిగమించడానికి.. వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రపంచ మార్కెట్‌లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కంపెనీ తెలిపింది. అయితే వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా 10 రోజుల సెలవు ప్రకటించామని, కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు.

గుజరాత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీలు దీపావళి సందర్భంగా సుదీర్ఘ సెలవులు తీసుకుంటాయి. అయితే ఇప్పుడు పండుగకు ముందే.. కంపెనీ సంచనల నిర్ణయం తీసుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సంస్థలో పనిచేస్తున్న 50,000 మందికి పైగా డైమండ్ పాలిషర్లు పనిచేస్తున్నారు. ఇందులో 40,000 మంది సహజ వజ్రాలను కత్తిరించి పాలిష్ చేస్తారు. మిగిలిన 10,000 మంది ల్యాబ్‌లో తయారయ్యే డైమండ్ యూనిట్‌లో పని చేస్తున్నారని లఖానీ పేర్కొన్నారు. కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారు మాత్రమే కాకుండా.. పాలిష్ చేసిన వజ్రాల అతిపెద్ద ఎగుమతిదారులలో కూడా ఒకటి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)