Breaking News

నేడు సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర

Published on Sat, 06/01/2024 - 10:02

న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్‌ రాకెట్‌లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు.  

అంతరిక్షంలో లోయర్ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్‌ స్టార్‌లైనర్‌ పనిచేస్తోంది.

ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైన్‌ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చెందిన హార్మోనీ మాడ్యుల్‌ సబ్‌సిస్టమ్స్‌ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు.  

ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్‌ మస్క్​కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.

బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్  విల్ మోర్‌ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 

2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు.

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)