కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారుతుందా?
Published on Thu, 03/26/2026 - 14:06
ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిచ్చే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) గత దశాబ్ద కాలంలో భారతీయ కుటుంబాల నమ్మకమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. 2014లో ప్రారంభమైన ఈ పథకం, నేడు కోట్లాది మంది తల్లుల కలలకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఈ పథకం వడ్డీ రేట్లపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.
వడ్డీ రేటులో మార్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రం
ప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 23న లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయమైన రిటర్న్స్‌ను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దశాబ్ద కాలంలో 100 రెట్లు వృద్ధి
గత పదేళ్లలో ఈ పథకం సాధించిన ప్రగతి అసాధారణం. గణాంకాలను పరిశీలిస్తే సామాన్యులకు ఈ పథకంపై ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. 2014-15లో కేవలం 4.2 లక్షలుగా ఉన్న ఖాతాలు, 2024-25 నాటికి 424.57 లక్షలకు చేరాయి. అంటే పదేళ్లలో 100 రెట్లు వృద్ధి నమోదైంది. ప్రారంభంలో రూ. 0.001 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు, ప్రస్తుతం రూ. 2.99 లక్షల కోట్లకు చేరడం విశేషం.
వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarterly) సమీక్షిస్తుంది. ప్రధానంగా శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభుత్వ సెక్యూరిటీల (G-Secs)పై వచ్చే దిగుబడిని బట్టి ఈ రేట్లను ఖరారు చేస్తారు. 2014–16 ఆర్థిక సంవత్సరంలో 9% పైచిలుకు ఉన్న వడ్డీ రేటు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2020–23 సంవత్సరాల్లో 7.6 శాతానికి (అత్యల్పం) చేరింది. 2024 నుండి ఈ వడ్డ రేటు 8.2 శాతంగా కొనసాగుతోంది.
Tags : 1