Breaking News

24 ఏళ్ల కింద కొన్న చీరే.. మళ్ళీ కొనలేదు - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published on Fri, 09/01/2023 - 11:21

సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు సైతం వారానికో, నెలకో షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ చాలా సింపుల్‌గా, ఎంతో మందికి ఆదర్శమైన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇన్ఫోసిస్ అనగానే గుర్తొచ్చేది 'నారాయణ మూర్తి', కానీ ఈ రోజు ఇన్ఫోసిస్ ఆ స్థాయిలో ఉందంటే దానికి పెట్టుబడి 'సుధా మూర్తి' ఇచ్చినదే అని చాలామందికి తెలియకపోవచ్చు. సుధా మూర్తి నేడు సుమారు రూ. 775 కోట్లు సంపద కలిగి ఉన్నప్పటికీ గత 24 సంవత్సరాల్లో ఒక్క చీర కూడా కొనలేదు అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం.

నిజానికి సింప్లిసిటీ గురించి మాట్లాడాల్సి వస్తే తప్పకుండా ఎవరైనా సుధా మూర్తి గురించి మాట్లాడతారు. 1950 ఆగష్టు 19న జన్మించిన సుధామూర్తి ఉన్నత భావాలు కలిగిన విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు.. ఎంతో మందికి సహాయం చేసే పరోపకారి కూడా. ఈమెకు 2023లో భారత ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ అందించింది.

చీరలు కొనకపోవడానికి కారణం..
24 సంవత్సరాలుగా చీరలు కొనకపోవడానికి వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. కాశీకి వెళ్ళినప్పుడు పవిత్ర గంగా స్నానం చేసి షాపింగ్ (ముఖ్యంగా చీరలు కొనడం) మానేస్తాని చెప్పుకోవడమే అని తెలుస్తోంది. ఎవరైనా గంగా నదిలో తమకు ఇష్టమైన వాటిని వదిలిపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ సుధా మూర్తి చీరలు కొనటం మానేసింది.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?

సుధా మూర్తి ఇష్టాలతో నారాయణ మూర్తి కూడా ఏకీభవించారు. ఈ కారణంగానే వారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారు. వీరిరువురూ పుస్తకాలు మాత్రం విరివిగా కొనుగోలు చేస్తారు. ఇప్పటికి వీరు 20,000కంటే ఎక్కువ బుక్స్ సేకరించినట్లు తెలుస్తోంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు