Breaking News

వడ్డీరేట్ల కోత పక్కా..?

Published on Thu, 01/09/2025 - 09:21

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్‌ ఉంది.

భారత వృద్ధికి ఊతమిచ్చేందుకు వచ్చే ఆర్‌బీఐ మానిటరీ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని సీఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ పురి అన్నారు. కార్మికుల అవసరం అధికంగా ఉండే రంగాల్లో ఉద్యోగ కల్పన ఉండవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దానివల్ల భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఆర్‌బీఐ ఎంపీసీ(MPC) సమావేశం జరగనుంది. చైనా వంటి దేశాల నుంచి భారీగా వస్తువులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో యాండీ డంపింగ్‌ డ్యూటీని పెంచే యోచనలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉక్కు, పేపర్‌బోర్డు, రసాయనాలు, పాలిమర్స్‌ వంటి ప్రత్యేక రంగాలకు దీనిని అమలు చేయబోతున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరిక

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్‌బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)