Breaking News

బ్యాంకు షేర్లకు డిమాండ్‌

Published on Tue, 07/22/2025 - 08:46

ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు మెటల్‌ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు సోమవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 443 పాయింట్లు పెరిగి 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 25,091 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 516 పాయింట్లు పెరిగి 82,274 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు బలపడి 25,111 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా.. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలహీనపడి 86.31 వద్ద స్థిరపడింది.

  • బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్‌ గూడ్స్‌ 1.33%, బ్యాంకెక్స్‌ 1.28%, ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ 1.26%, మెటల్, కమోడిటీస్‌ 1%, ఆటో, కన్జూమర్‌ డిస్క్రేషనరీ 0.5% చొప్పున పెరిగాయి.

  • అంచనాలకు మించి తొలి త్రైమాసిక నికరలాభం రూ.16,258 కోట్ల నమోదుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 2% పెరిగి రూ.2,000 వద్ద స్థిరపడింది. క్యూ1 ఆరి్థక ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్, తొలిసారి 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీతో పాటు బ్రోకరేజ్‌ సంస్థలు షేరుకు ‘బై’ రేటింగ్‌ కేటాయింపు అంశాలు కలిసొచ్చాయి. 

  • ఐసీఐసీఐ బ్యాంకు షేరు 3% లాభపడి రూ.1,466 వద్ద స్థిరపడింది. తొలి త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించడంతో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది.  

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 3% నష్టపోయి రూ.1428 వద్ద నిలిచింది. తొలి త్రైమాసికంలో ఆయిల్‌–కెమికల్స్‌(ఓ2సీ), రిటైల్‌ విభాగాల పనితీరు నిరాశపరచడంతో పాటు ఇటీవలి ర్యాలీతో షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)