Breaking News

సాక్షి మనీ మంత్ర: 20,100 పైనే నిఫ్టీ.. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Published on Thu, 11/30/2023 - 16:37

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. 

ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్లు నెలవారీ గడువు ముగింపు, ఐదు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఫెడ్‌ఛైర్మన్‌ పావెల్‌ సమావేశం ఉండడంతో కూడా మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెన్సెక్స్ 87 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల పుంజుకుని 20,133కు చేరింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంలో నెల చివరి రోజు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు  లాభాలతో మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, విప్రో, ఓఎన్‌జీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్‌ టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్‌సీఎల్‌ టెక్ కంపెనీలతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. 

ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)