Breaking News

6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!

Published on Wed, 11/13/2024 - 16:13

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్‌లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ‍ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్‌ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ పావెల్‌ యూఎస్‌ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్‌ మినట్స్‌ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.

ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌. ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)