హీట్‌కు హాట్ సొల్యూషన్: ఇదిగో కూల్ గ్యాడ్జెట్లు!

Published on Sun, 03/22/2026 - 15:43

వేసవి వచ్చిందంటే బయట అడుగు పెడితే చాలు, సూర్యుడు తన వేడి గాలిని ముఖంపై కొడుతూ ‘ఇంట్లోనే ఉండు’ అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాని, టెక్నాలజీ తెచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్లు, సూర్యుడు తన వేడి ఎంత పెరిగినా ‘ఊఫ్‌’ నుంచి ‘ఆహా!’గా మార్చేస్తాయి.

ఫోనుకి బుజ్జి ఏసీ!
సమ్మర్‌లో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మీ ఫోన్‌ వేడి పెనంలా మారిపోతుందా? అయితే మీ ఫోన్ చల్లబరచడానికి వచ్చేసింది ఈ మొబైల్‌ కూలింగ్‌ ప్యాడ్‌! ఇది మామూలు ఫ్యాన్‌ కాదు, ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్‌ టెక్నాలజీ మీ ఫోన్‌ టెంపరేచర్‌ను కేవలం సెకన్లలోనే తగ్గించేస్తుంది. 

అంటే బయట ఎండలు మండిపోతున్నా, మీ ఫోన్‌ మాత్రం వింటర్‌ వాతావరణంలో ఉన్నట్టే చిల్‌ అవుతుంది! దీనికి ఉన్న ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫోన్‌ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. పైగా ఇందులోని మ్యాగ్నెట్‌ ఫీచర్‌ వల్ల ఫోన్‌ వెనుక సులభంగా అతుక్కుపోతుంది, మీరు గంటల తరబడి గేమింగ్‌ చేసినా లేదా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వదు, బ్యాటరీ కూడా వేడెక్కదు. ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌.. ఏదైనా సరే, సెట్‌ అయిపోతుంది. ధర రూ. 700 మాత్రమే!

మ్యాజిక్‌ గ్లాసెస్‌!
ఫోన్‌ చూసి చూసి మీ కళ్లు ‘ఫ్రై’ అయిపోతున్నాయా? బయటకి వెళ్దామంటే సూర్యుడు సెగలతో సినిమా చూపిస్తున్నాడా? ఇలా ఒకేసారి కళ్లకు రక్షణ, మైండ్‌కి రిలాక్సేషన్‌ ఇచ్చేందుకు వచ్చేసింది ఈ స్మార్ట్‌ బ్లూటూత్‌ గ్లాసెస్‌! ఇందులో ఇన్‌–బిల్ట్‌ స్పీకర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు కళ్లజోడు పెట్టుకుంటే చాలు, పక్కన ఎవరికీ వినిపించకుండా మీ చెవుల్లో మ్యూజిక్‌ వినిపిస్తుంది.

ఫోన్‌ తీయకుండానే కాల్స్‌ కూడా మాట్లేడేయొచ్చు. సాంగ్స్‌ మార్చుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫోటోక్రోమిక్‌ లెన్సులు ఇంట్లో ఉన్నప్పుడు బ్లూ లైట్‌ నుంచి, అదే అడుగు బయట పెట్టగానే సెకన్లలో కూలింగ్‌ గ్లాసెస్‌లా మారి కళ్లకు రక్షణ ఇస్తాయి. పైగా వర్షం పడినా, చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్‌ రెసిస్టెన్స్ కూడా ఉంది. ధర రూ. 1,200 మాత్రమే!

మంచు కురిపించే గొడుగు!
బయట ఎండలు మండిపోతుంటే.. గొడుగు పట్టుకున్నా సెగలు తగులుతూ చిరాగ్గా ఉందా? అయితే మీ పర్సనల్‌ ఏసీలాంటి ఈ బీఎన్‌ఎఫ్‌ సన్‌ అంబ్రెల్లాని చూస్తే మీరు ఫిదా అయిపోతారు! దీని లోపల ఒక బుజ్జి ఫ్యాన్‌ ఉండటమే కాకుండా, ఇది చల్లని నీటిని మంచులా చల్లుతుంది. అంటే ఎండలో వెళ్తున్నా, మీ గొడుగు కింద ఒక చిన్న మంచువాన కురుస్తుంది. కేవలం నాలుగు ఏఏ బ్యాటరీలు ఉంటే చాలు.. గాలికి తిరగబడని విండ్‌ప్రూఫ్‌ డిజైన్‌తో, అటు గాలిని.. ఇటు మంచు జల్లులను మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌ ఇవ్వడానికి కూడా ఇది ఒక అదిరిపోయే ఆప్షన్‌. ధర రూ. 5,900.

Videos

అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు

హెచ్-1బీ వీసా కష్టాలు.. కరిగిపోతున్న అమెరికా కలలు

ఖతార్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?

వెనుక ఉండి నక్కి నక్కి చూస్తున్నాడు.. ఇప్పుడు అర్థమైందా నీ స్థాయి BR నాయుడు..

పెట్రోల్ రేటు పెంపు? చమురు కొరతపై మోదీ రివ్యూ మీటింగ్..

రెచ్చిపోయిన సీఎం రమేష్.. బంజారా హిల్స్ లో భూకబ్జాకు యత్నం

అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్

సిద్ధమైన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏక్షణమైనా దాడి చేసే ఛాన్స్..

యూట్యూబర్ వైష్ణవి భర్తకు తీవ్ర అస్వస్థత

Photos

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)