Breaking News

రేర్‌ ఎర్త్‌ ప్రాసెసింగ్‌లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి 

Published on Thu, 07/31/2025 - 00:38

న్యూఢిల్లీ: రేర్‌ ఎర్త్‌ మూలకాలు సహా కీలక ఖనిజాల వెలికితీత, ప్రాసిసెంగ్‌లో రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా పాలుపంచుకోవాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. ఇది క్రిటికల్‌ ఖనిజాలకు అదనపు విలువను జోడించే వ్యవస్థపరంగా భారత్‌ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొంది. 

విద్యుత్‌ వినియోగాన్ని, డివైజ్‌ల పరిమాణాన్ని తగ్గించగలిగే భౌతిక, రసాయనిక స్వభావాలున్న రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ అనేవి నేడు నిర్మాణ, ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్‌ తదితర రంగాల్లో కీలకంగా మారినట్లు నివేదిక వివరించింది. గత నాలుగేళ్లుగా భారత్‌ ఏటా సగటున 3.3 కోట్ల డాలర్ల విలువ చేసే రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్, సంబంధిత ఖనిజాలను దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ దిగుమతులు 3.19 కోట్ల డాలర్లకు చేరగా, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ దిగుమతులు మరింత అధికంగా 24.9 మిలియన్‌ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. లాంథనం, ల్యూటీషియంలాంటివి రేర్‌ (అరుదైన) ఎర్త్‌ మూలకాల కోవకు చెందుతాయి. వాస్తవానికి ఇవి పుష్కలంగా ఉన్నప్పటికీ, వెలికితీత ప్రక్రియ చాలా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో రేర్‌ ఎర్త్‌ మూలకాలుగా పరిగణిస్తారు. 
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)