Breaking News

పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..

Published on Sat, 05/04/2024 - 12:52

కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.

ఫిట్‌‌‌‌నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల  ప్రైవేట్  మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.

తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్‌ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి. 

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!

దిల్లీ-ఎన్‌సీఆర్‌కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)