Breaking News

100 పెట్రోల్‌ బంకుల ఏర్పాటులో ఐపీఎం

Published on Fri, 01/12/2024 - 04:24

గువాహటి: ఇంధన రిటైల్‌ స్టార్టప్‌ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్‌ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్‌ ప్రకాశ్‌ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్‌ ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఔట్‌లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్‌ రిఫైనరీస్‌తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్‌ పశి్చమ బెంగాల్‌లో 25 ఔట్‌లెట్స్‌ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్‌జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)