Breaking News

నెలకు రూ.260 కోట్ల జీతం: ఎవరీ సీఈఓ తెలుసా?

Published on Sat, 01/25/2025 - 16:19

ఎక్కువ జీతాలు తీసుకునే సీఈఓలు ఎవరంటే? టక్కున చెప్పే సమాధానం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ చీఫ్‌ సుందర్ పిచాయ్. అయితే వీరి కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఓ వ్యక్తి ఒకరున్నారని బహుశా.. కొంతమందికి తెలిసుండకపోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన జీతం ఎంత? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.

యాపిల్, గూగుల్ చీఫ్‌లు ఒక్కొక్కరు దాదాపు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 646 కోట్లు) ప్యాకేజ్ తీసుకుంటారు. కానీ ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) సీఈఓ 'బ్రియాన్ నికోల్'(Brian Niccol) మాత్రం ఏకంగా 96 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. అంటే ఆయన జీతం సుమారు రూ. 827 కోట్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.

గత ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో కంపెనీలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్.. జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల నుంచి వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన కంపెనీలో చేరిన నెల రోజుల తరువాత 5 మిలియన్ డాలర్ల సైన్ ఆన్ బోనస్‌ కూడా పొందారు. దీంతో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో నికోల్ ఒకరుగా నిలిచారు.

సెప్టెంబర్ 2024లో నికోల్‌ బాధ్యతలు తీసుకున్నప్పుడు.. కంపెనీ ఆయన వార్షిక వేతన ప్యాకేజీ విలువ సుమారు 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే సీఈఓగా చేరిన కేవలం నాలుగు నెలల్లో 96 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు. గత ఏడాది స్టార్‌బక్స్ వరుస నష్టాలను చవి చూసిన సమయంలో.. సంస్థ భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో నికోల్‌ను నియమించింది.

ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)