Breaking News

తెరకెక్కనున్న ఆర్‌బీఐ ప్రస్థానం!

Published on Tue, 11/12/2024 - 18:12

దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్‌ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్‌బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్‌బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్‌ సిరీస్‌ రూపంలో తెరకెక్కించనుంది.

1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్‌ సిరీస్‌ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) కింద బిడ్‌ ఆఫర్‌ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్‌లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్‌లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్‌ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు

ఆర్‌ఎఫ్‌పీ పత్రం ప్రకారం, ఆర్‌బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్‌లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్‌లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్‌బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)