భారత్‌లో రిటైల్‌కు విదేశీ బ్యాంకుల గుడ్‌బై

Published on Wed, 07/29/2026 - 04:07

ఒకప్పుడు భారత్‌లో వ్యాపార విస్తరణకు, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్‌ వద్ద తీవ్రంగా లాబీయింగ్‌ చేసి దేశ బ్యాంకింగ్‌ రంగంలోకి క్యూ కట్టిన విదేశీ బ్యాంకులు ఇప్పుడు ఒక్కొక్కటిగా భారత రిటైల్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ భారత్‌లో తన రిటైల్‌ క్రెడిట్‌ కార్డు వ్యాపారాన్ని పూర్తిగా ఫెడరల్‌ బ్యాంకుకు అప్పగించింది. దీంతో 4.5 లక్షల క్రెడిట్‌ కార్డు అకౌంట్లు ఫెడరల్‌ బ్యాంక్‌ ఖాతాలో పడ్డాయి. అయితే విదేశీ బ్యాంకులు భారత్‌ బ్యాంకింగ్‌ నుంచి పూర్తిగా వైదొలగడం లేదని, వినియోగదారుల బ్యాంకింగ్‌కు బదులుగా కార్పొరేట్‌ బ్యాంకింగ్, ట్రేడ్‌ ఫైనాన్స్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూషనల్‌ బ్యాంకింగ్‌ వంటి అధిక లాభదాయక రంగాలపై ఫోకస్‌ మార్చుకున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

దేశీ బ్యాంకులే అసలు సవాల్‌ 
విదేశీ బ్యాంకులు వెనక్కు తగ్గడానికి ప్రధాన కారణం దేశీ బ్యాంకుల అపారమైన నెట్‌వర్క్‌ బలం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి సంస్థలకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో శాఖలు, కోట్లాది కస్టమర్లు, బలమైన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే భారత్‌లోని అన్ని విదేశీ బ్యాంకుల శాఖలను కలిపినా 800 దాటవు. తక్కువ శాఖలతో వాటికి చౌక డిపాజిట్లు సేకరించడం కష్టమవుతోంది. అదేసమయంలో రిటైల్‌ రుణాల్లో దేశీ బ్యాంకులు డేటా అనలిటిక్స్, డిజిటల్‌ యాప్స్, క్రాస్‌ సెల్లింగ్‌ ద్వారా భారీ ఆధిక్యం సాధించాయి. 

నిబంధనల భారం 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవలి కాలంలో క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ లెండింగ్, డేటా లోకలైజేషన్, ఔట్‌ సోర్సింగ్, కస్టమర్‌ ఫిర్యాదుల పరిష్కారం, టెక్నాలజీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ 
వంటి అంశాలపై అనేక నిబంధనలను కఠినతరం చేసింది. దిగ్గజ దేశీ బ్యాంకులు వీటిపై అయ్యే ఖర్చును తమకున్న భారీ కస్టమర్‌ బేస్‌పై విభజించగలుగుతున్నాయి. కానీ పరిమిత వ్యాపారంలో ఉన్న విదేశీ బ్యాంకులకు ఈ ఖర్చు అధిక భారంగా మారుతోంది.

దీనివల్ల రిటైల్‌ బ్యాంకింగ్‌లో లాభదాయకత తగ్గుతోంది. రిటైల్‌ బ్యాంకింగ్‌ అంటేనే దేశ వ్యాప్తంగా శాఖలు, సిబ్బంది, టెక్నాలజీ, మార్కెటింగ్, కాంప్లెయన్స్‌ పై భారీ పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. అయితే చేసిన పెట్టుబడిపై రాబడి రావడానికి సంవత్సరాలు పడుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ బ్యాంకులు తక్కువ మూలధనంతో ఎక్కువ అదాయం వచ్చే రంగాలవైపు మళ్లుతున్నాయి. కార్పొరేట్‌ లోన్లు, ట్రేడ్‌ ఫైనాన్స్, ట్రెజరీ, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో వీటికి సహజమైన ఆధిక్యం ఉండడంతో వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. 

మారుతున్న వ్యూహం 
విదేశీ బ్యాంకులు భారత మార్కెట్‌ను వదిలి పెట్టడంలేదు. వేగంగా ఎదుగుతున్న భారత ఆరి్ధకవ్యవస్థలో కార్పొరేట్‌ ఫైనాన్సింగ్, విదేశీ పెట్టుబడులు, ట్రేడ్‌ ఫైనాన్స్, ట్రెజరీ సేవలు, వెల్త్‌ మేనేజ్‌ మెంట్‌ రంగాల్లో భారీ అవకాశాలు కనిపిస్తున్నా యి. అంతర్జాతీయ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు, హైనెట్‌వర్త్‌ వ్యాపారులకు సేవలందించడం ద్వారా మెరుగైన లాభాలు వస్తుండడంతో తమ వ్యాపార నమూనాను ఆదిశగా మార్చుకుంటున్నాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. 
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

నిష్క్రమణ బాటలో 
గత పదేళ్లలో అనేక విదేశీ బ్యాంకులు ఇదే దారిలో నడిచాయి. సిటీ బ్యాంక్‌:  తన మొత్తం భారత కన్జూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని 2022లో యాక్సిస్‌ బ్యాంకుకు విక్రయించింది. రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ (ఆర్‌బీఎస్‌): భారత్‌లో రిటైల్‌ కార్యకలాపాలను పూర్తిగా మూసివేసింది. డాయిష్‌ బ్యాంక్‌:  రిటైల్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు విక్రయించింది. హెచ్‌ఎస్‌బీసీ: ఏఎన్‌జెడ్‌  వంటి బ్యాంకులు కూడా రిటైల్‌ కార్యకలాపాలను తగ్గించి కార్పొరేట్‌ సేవలపైనే దృష్టి పెట్టాయి.

దేశీ బ్యాంకులకు అవకాశం 
విదేశీ బ్యాంకులు రిటైల్‌ రంగం నుంచి వెనక్కి తగ్గడం దేశీ బ్యాంకులకు భారీ అవకాశంగా మారుతోంది. రిటైల్‌ రుణాలు, క్రెడిట్‌ కార్డులు, డిపాజిట్లు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కస్టమర్లను భారీ ఎత్తున సొంతం చేసుకునే అవకాశం భారత బ్యాంకులకు లభిస్తోంది. సాంకేతికత, డిజిటల్ డిజిటల్‌ బ్యాంకింగ్, విస్తృత శాఖల నెట్‌వర్క్, తక్కువ ఖర్చుతో డిపాజిట్లు సమీకరించే సామర్థ్యం వల్ల దేశీయ బ్యాంకులు ఇప్పటికే మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాయి.ఇక ఈ రంగంలో విదేశీ బ్యాంకుల నిష్క్రమణతో ఆ ఆధిపత్యం మరింత పెరిగే అవ కాశాలున్నాయి. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)