Breaking News

'స్క్విడ్ గేమ్'నట్టేట ముంచింది, కోట్లలో నష్టపోయి లబోదిబో మంటున్నారు

Published on Tue, 11/02/2021 - 19:27

సౌత్‌ కొరియన్‌ డ్రామా 'స్క్విడ్‌ గేమ్‌' ఇన్వెస్టర్లను నట్టేట ముంచింది. వెబ్‌ సిరీస్‌ నట్టేట ముంచడం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారా? 'స్క్విడ్‌ క్రిప్టోకరెన్సీ' పేరుతో ఏర్పాటైన క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రారంభించిన వారంలోనే కరెన్సీ భారీ ఎత్తున లాభాల్ని తెచ్చి పెట్టినా..ఇప్పుడు భారీగా నష్టపోతున్నారు.  

కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ 

కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ లెక్కల ప్రకారం.. స్క్విడ్‌ క్రిప్టో కరెన్సీ విలువ అక్టోబర్‌ 26న $0.01236 నుంచి అక్టోబర్‌ 29కి $4.5 కి చేరింది. దీంతో  కేవలం 100 గంటల్లో  మదుపర్లు రూ.1000 నుంచి రూ.3,43,850 లక్షల వరకు సంపాదించారు. ఆ లాభాలు ఎక్కువయ్యేసరికి పెట్టుబడుల్ని భారీగా పెంచారు. కానీ ఇప్పుడు ఆ కరెన్సీ వ్యాల్యూ జీరోకి పడిపోవడంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ ప్రకారం..స్క్విడ్‌ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ గరిష్టంగా $2,861 చేరిన తరువాత ఆ వ్యాల్యూ కాస్తా సడెన్‌ $0కి పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు సుమారు రూ.25.3కోట్లు నష్టపోయారు.


 


స్క్విడ్‌ క్రిప్టోకరెన్సీ మోసం 
సెప్టెంబర్‌ 17న విడుదలై 90 దేశాల్లో నెంబర్‌ 1 వెబ్‌ సిరీస్‌గా నిలిచిన స్క్విడ్‌ గేమ్‌ పేరుతో సైబర్‌ నేరస్తులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోర్బ్స్‌ సెప్టెంబర్‌ 27 తేదీన విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఒక్క యూఎస్‌లో వారం రోజుల వ్యవధిలోనే టీవీ స్క్రీన్‌లపై  స్క్విడ్‌ గేమ్‌ 9 ఏపీసోడ్‌లను ఆడియన్స్‌ 3.26 బిలియన్‌ మినిట్స్‌ వీక్షించారని, దీంతో ఈ గేమ్‌ మరో రికార్డ్‌ సృష్టించినట్లైందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. అయితే దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు స్కామర్లు మూడు వారాల క్రితం స్క్విడ్‌ గేమ్‌ పేరుతో స్వ్కిడ్‌ క్రిప్టో కరెన్సీని (SquidGame.cash.పేరుతో వెబ్‌సైట్‌) ను ప్రారంభించారు. 


స‍్క్విడ్‌ గేమ్‌ కు ప్రజాదారణ బాగుందని, తాము ఏర్పాటు చేసిన క్రిప్టోలో పెట్టుబడి పెడితే లాభాల్ని అర్జించవచ్చిన ఊదరగొట్టారు. దీంతో పలువురు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్లాన్‌ ప్రకారం ఇన్‌స్టంట్‌ గా కాయిన్‌ వ్యాల్యూని పెంచారు. ఆ వ్యాల్యూ పెరగడంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి. అంతే అదును చూసిన మోసగాళ్లు మొత్తం డబ్బును కాజేసి కరెన్సీ వ్యాల్యూని జీరోకి తగ్గించారు. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్‌ చేసిన పెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. అదే సమయంలో నిపుణులు క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాల్ని గుర్తించాలని హెచ్చరిస‍్తున్నారు. 

చదవండి: స్క్విడ్‌ గేమ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా..!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)