Breaking News

స్పైస్‌జెట్‌ లాభాలు మూడింతలు 

Published on Sun, 06/15/2025 - 05:42

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో రూ.325 కోట్ల స్టాండెలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం (2023–24) క్యూ4లో ప్రకటించిన రూ.119 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. నిర్వహణ ఆదాయం మాత్రం రూ.1,719 నుంచి రూ.1,446 కోట్లకు తగ్గింది. ‘‘మార్చి క్వార్టర్‌లో రికార్డు స్థాయి నికర లాభాన్ని ఆర్జించగలిగాము. ప్రమోటర్‌ గ్రూప్‌ క్యూ4లో రూ.294 కోట్లు సహా మొత్తం రూ.500 కోట్లు మూలధనాన్ని సమకూర్చింది.

 ఇది కంపెనీ దీర్ఘకాలిక దృష్టి, సామర్థ్యంపై నమ్మకాన్ని సూచిస్తుంది’’ అని స్పైస్‌జెట్‌ తెలిపింది. కంపెనీ పూర్తి ఆర్థిక సంవత్సరానికిగానూ గత ఏడేళ్లలో తొలిసారి రూ.59 కోట్ల లాభాన్ని ప్రటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.409 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. తాజాగా నిర్వహణ ఆదాయం 25% క్షీణించి రూ.7,050 కోట్ల నుంచి రూ.5,284 కోట్లకు దిగివచి్చంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదంపై స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వైమానిక పరిశ్రమ వారికి బాసటగా ఉంటుందన్నారు.
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)