Breaking News

లాభాల్లోకి స్పైస్‌జెట్‌.. నష్టాలను వీడిన తక్కువ ధరల ఎయిర్‌లైన్స్‌!

Published on Tue, 08/15/2023 - 07:44

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో రూ. 205 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు డిమాండ్‌ పెరగడం ఇందుకు సహకరించింది.

గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 789 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 2,457 కోట్ల నుంచి రూ. 2,002 కోట్లకు నీరసించింది. నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,072 కోట్ల నుంచి రూ. 1,291 కోట్లకు భారీగా తగ్గాయి. పలు సవాళ్ల నేపథ్యంలోనూ లాభాలు ఆర్జించగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అజయ్‌ సింగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తాము చేపట్టిన రూ. 500 కోట్ల పెట్టుబడులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునిచ్చినట్లు తెలియజేశారు. ఈ కాలంలో లాజిస్టిక్స్‌ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ను విడదీయడంతో స్పైస్‌జెట్‌ నెట్‌వర్త్‌ మెరుగుపడినట్లు వెల్లడించారు.  ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేరు బీఎస్‌ఈలో 7% జంప్‌చేసి దాదాపు రూ. 34 వద్ద ముగిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)