Breaking News

కార్లయిల్‌కు స్పైస్‌జెట్‌ షేర్లు 

Published on Thu, 11/20/2025 - 01:42

ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ తాజాగా గ్లోబల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్, ఫైనాన్సింగ్‌ సంస్థ కార్లయిల్‌ ఏవియేషన్‌ పార్ట్‌నర్స్‌(సీఏపీ)కు ఈక్విటీ షేర్లను కేటాయించింది. తద్వారా బ్యాలన్స్‌షిట్‌ నుంచి 50 మిలియన్‌ డాలర్ల లయబిలిటీల(రూ. 442 కోట్ల రుణాలు)ను తగ్గించుకుంది. అంతేకాకుండా తాజా నిధులతో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దారి ఏర్పాటు చేసుకోనుంది. 121.18 మిలియన్‌ డాలర్ల లీజ్‌ బకాయిల పునర్వ్యవస్థీకరణకు సీఏపీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సెపె్టంబర్‌ 11న కంపెనీ ప్రకటించింది. దీంతో 89.5 మిలియన్‌ డాలర్ల లిక్విడిటీకి వీలున్నట్లు తెలియజేసింది. 

తద్వారా పునర్వ్యవస్థీకరణ చర్యల కొనసాగింపునకు మద్దతు లభించనున్నట్లు పేర్కొంది. కాగా.. కంపెనీ బోర్డు అలాట్‌మెంట్‌ కమిటీ షేరుకి రూ. 42.32 ధరలో నాన్‌ప్రమోటర్‌ కేటగిరీలో ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన 10,41,72,634 షేర్ల జారీకి తాజాగా ఆమోదముద్ర వేసినట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. అంతేకాకుండా 79.6 మిలియన్‌ డాలర్ల నగదు మెయింటెనెన్స్‌ రిజర్వులకు ఒప్పందం వీలు కలి్పంచనుంది. భవిష్యత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్, ఇంజిన్‌ల నిర్వహణకు వీటిని వినియోగించనుంది. మరో 9.9 మిలియన్‌ డాలర్లు లీజ్‌ ఆబ్లిగేషన్లకుగాను నగదు నిర్వహణా క్రెడిట్స్‌గా పొందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెపె్టంబర్‌)లో స్పైస్‌జెట్‌ నికర నష్టం భారీగా పెరిగి రూ. 635 కోట్లను తాకిన విషయం విదితమే. 

బీఎస్‌ఈలో స్పైస్‌జెట్‌ షేరు దాదాపు యథాతథంగా రూ. 37 వద్ద ముగిసింది.

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)