Breaking News

మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు

Published on Thu, 09/26/2024 - 13:49

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.

సంస్థ ఉద్యోగులకు జూన్‌ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్‌(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్‌ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!

కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్‌స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్‌ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి