Breaking News

సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు

Published on Tue, 01/09/2024 - 14:21

అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? 

అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు.

కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)