Breaking News

సోనాలికా చిన్న కార్లు!

Published on Sat, 09/28/2024 - 06:22

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్‌ త్వరలో ఎలక్ట్రిక్‌ క్వాడ్రిసైకిల్‌ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్‌కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్‌కు రూపకల్పన చేసినట్టు పంజాబ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్‌ క్వాడ్రిసైకిల్‌ నెదర్లాండ్స్‌ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్‌ క్వాడ్రిసైకిల్‌ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్‌ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్‌తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది. 
నడపడం సులభం.. 
యూరప్‌లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్‌ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్‌ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్‌ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్‌ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్‌ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్‌ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు