Breaking News

వెండి విమానం! సూర్యుడే ఇంధనం!!

Published on Wed, 08/21/2024 - 22:14

ఇది విమానంలా కనిపిస్తున్నా.. విమానం కాదు. సిల్వర్-ఫాయిల్‌ తయారు చేసిన, హీలియం నింపిన ఓ పేద్ద బుడగ లాంటిది. గాల్లోకి ఎగిరి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అందిస్తుంది. పగలంతా సౌరశక్తిని వాడుకుని రాత్రిళ్లు కూడా పనిచేస్తుంది.

రిమోట్ ప్రాంతాలలోని వ్యక్తులకు ఎత్తులో ఎగిరే బ్లింప్ లాంటి విమానం నుంచి ఎందుకు అందించకూడదు? అన్న ఆలోచనతోనే న్యూ మెక్సికోకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కీయే (Sceye) సౌర శక్తిని ఉపయోగించుకుని స్ట్రాటోఆవరణలో సంచరించే హ్యాప్స్‌ (HAPS- హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ స్టేషన్)ను రూపొందించింది.

స్కీయే హ్యాప్స్‌ 65 మీటర్ల (213-అడుగులు) పొడవైన సిబ్బంది లేని హీలియం నిండిన విమానం. దీన్ని నిలువుగా నింగిలోకి ప్రయోగిస్తారు. 60,000 నుంచి 65,000 అడుగుల (18,288 నుండి 19,812 మీ) ఎత్తుకు ఇది వెళ్తుంది. సిల్వర్-ఫాయిల్‌ తయారైన దీని ఉపరితలంపై ఉండే గాలియం సెలీనైడ్, గాలియం ఆర్సెనైడ్ సౌర ఘటాల శక్తి ద్వారా జీపీఎస్‌ సాయంతో నిర్దేశిత ఎత్తులో దీన్ని సంచరించేలా చేస్తారు. ఇది మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ని ప్రసారం చేయడం, వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, అడవుల్లో మంటలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటి పనులను చేయగలదు.

ఈ విమానానికి సంబంధించిన సరికొత్త మైలురాయి గత వారమే వచ్చింది. దాని సౌర ఘటాల ద్వారా పగటిపూట దాని బ్యాటరీలను ఛార్జ్ చేసుకుని, ఆ బ్యాటరీ శక్తిని ఉపయోగించి రాత్రిపూట కూడా ఆ స్థానంలో నిలిచి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7:36 గంటలకు న్యూ మెక్సికోలోని స్కీయే స్థావరం నుంచి దీన్ని ప్రయోగించగా 61,000 అడుగుల (18,593 మీ) ఎత్తుకు చేరుకుని మరుసటి రోజు మధ్యాహ్నం 12:21 గంటల వరకూ నిర్దేశిత ఎత్తులోనే సేవలందించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)