Breaking News

స్మార్ట్‌వాచీలకు ఏమైంది? వరుసగా మార్కెట్‌ డౌన్‌

Published on Thu, 08/21/2025 - 13:52

దేశీయంగా వేరబుల్‌ మార్కెట్‌ వరుసగా అయిదో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. స్మార్ట్‌వాచీలు, ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌బడ్స్‌ విక్రయాలు తగ్గడంతో ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు 9.4 శాతం క్షీణించి 2.67 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం సరఫరా తగ్గినప్పటికీ వేరబుల్స్‌ సగటు విక్రయ ధర (ఏఎస్‌పీ) ఒక మోస్తరుగా 2.2 శాతం మేర పెరిగి 19.2 డాలర్లకు (సుమారు రూ. 1,700)కు చేరింది. 2025 ప్రథమార్థంలో వేరబుల్‌ డివైజ్‌ మార్కెట్‌ వార్షికంగా 6.3 శాతం తగ్గి 5.16 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. ఏఎస్‌పీ పెద్దగా మార్పులు లేకుండా 18.7 డాలర్ల (సుమారు రూ. 1,630) స్థాయిలో కొనసాగింది. స్మార్ట్‌ రింగ్స్, స్మార్ట్‌ గ్లాసెస్, స్మార్ట్‌ రిస్ట్‌బ్యాండ్స్‌లాంటి కొత్త రకం వేరబుల్స్‌కి డిమాండ్‌ పెరిగింది.

మరిన్ని ముఖ్యాంశాలు..

  • అమ్మకాలు 4.8 శాతం తగ్గినప్పటికీ వేరబుల్స్‌ మార్కెట్లో 28 శాతం వాటాతో ఇమేజిన్‌ మార్కెటింగ్‌ (బోట్‌ బ్రాండ్‌) అగ్రస్థానంలో ఉంది.  

  • 13.1 శాతం వాటాతో నాయిస్‌ రెండో స్థానంలో నిల్చింది. విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.

  • గోబోల్ట్‌ (గతంలో బోల్ట్‌) అమ్మకాలు 21.8 శాతం పెరిగాయి. 10.9 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఒప్పో, వన్‌ప్లస్‌ వాటా చెరి 8 శాతంగా, రియల్‌మి వాటా 6.5 శాతంగా ఉంది.

  • ఇక స్మార్ట్‌వాచీల అమ్మకాలు వరుసగా ఆరో త్రైమాసికంలోనూ క్షీణించాయి. జూన్‌ క్వార్టర్‌లో 28.4 శాతం తగ్గి 66 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం వేరబుల్స్‌ మార్కెట్లో వీటి వాటా 31.5 శాతం నుంచి 24.9 శాతానికి తగ్గింది. బౌల్ట్‌ మినహా మిగతా అన్ని బ్రాండ్ల (నాయిస్, బోట్, టైటాన్, ఫైర్‌ బోల్ట్‌) స్మార్ట్‌వాచీల అమ్మకాలు తగ్గాయి.

  • 2022, 2023లో భారీగా వృద్ధి చెందిన స్మార్ట్‌వాచీల మార్కెట్‌ ప్రస్తుతం కన్సాలిడేట్‌ అవుతోంది.  

  • ఇయర్‌వేర్‌ కేటగిరీ స్వల్పంగ్‌ 1.2 శాతం తగ్గి 1.99 కోట్ల యూనిట్లకు పరిమితం అయింది. ట్రూలీ వైర్‌లెస్‌ స్టీరియో (టీడబ్ల్యూఎస్‌) సెగ్మెంట్‌ అమ్మకాలు 1.2 శాతం తగ్గినా, 71.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. నెక్‌బ్యాండ్‌ స్టయిల్‌ ఇయర్‌వేర్‌ మరింతగా 16.1 శాతం మేర పడిపోయింది. ఓవర్‌–ది–ఇయర్‌ సెగ్మెంట్‌ అమ్మకాలు 97.4 శాతం ఎగిసి 15 లక్షల యూనిట్లకు పెరిగాయి.  

  • టీడబ్ల్యూఎస్‌ విభాగంలో 31.9 శాతం వాటాతో బోట్‌ అగ్రస్థానంలో, 14.9 శాతం వాటాతో బోల్ట్‌ రెండో స్థానంలో ఉన్నాయి. బోట్‌ అమ్మకాలు 6.9 శాతం తగ్గాయి.

  • స్మార్ట్‌ రింగ్స్‌ విక్రయాలు 2.8 శాతం పెరిగి 75,000కు చేరాయి. అ్రల్టాహ్యూమన్, గేబిట్, ఆబో సంస్థలు సంయుక్తంగా 65 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయి.  

  • మెటా, లెన్స్‌కార్ట్‌ కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్స్‌ దన్నుతో స్మార్ట్‌ గ్లాసెస్‌ అమ్మకాలు 4,000 నుంచి ఏకంగా 50,000 యూనిట్లకు పెరిగాయి.  

  • స్మార్ట్‌ రిస్ట్‌బ్యాండ్స్‌ విక్రయాలు 118.5 శాతం పెరిగి 83,000 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా శాంసంగ్‌కి చెందిన ఫిట్‌3కి గణనీయంగా డిమాండ్‌ నెలకొంది. క్యూ2లో రిస్ట్‌బ్యాండ్స్‌ కేటగిరీలో శాంసంగ్‌ 80.6 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు