Breaking News

సంబంధాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. సర్వేలో భయంకర నిజాలు

Published on Thu, 12/05/2024 - 18:22

మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ వాడకం మానవ వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోందని.. తల్లిదండ్రులు & పిల్లల మధ్య కూడా దూరాన్ని పెంచేస్తోందని.. వివో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

తల్లిదండ్రులు సగటున రోజుకి.. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు నాలుగు గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లలో గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియా, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ మార్పులు వారి మధ్య సంఘర్షణకు కూడా కారణమవుతున్నట్లు తెలిసింది.

73 శాతం మంది తల్లిదండ్రులు.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య వివాదానికి కారణం మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగమే అని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో అనివార్యమైన భాగంగా మారింది. దీంతో 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు తమ స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా జీవించలేరని అంగీకరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ఇదీ చదవండి: అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్‌లో

64 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయినట్లు, ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వినోద కార్యక్రమాలలో గడుపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్లను అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)