Breaking News

ఎయిర్‌టెల్‌ లాభం రెట్టింపు 

Published on Tue, 11/04/2025 - 04:47

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 8,651 కోట్లను తాకింది. పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్లు, స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్ల నుంచి అధిక చెల్లింపులు ఇందుకు దోహదపడ్డాయి. 

ఆఫ్రికా లాభం సైతం భారీగా దూసుకెళ్లి రూ. 969 కోట్లయ్యింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,153 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం జంప్‌చేసి రూ. 52,145 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 41,473 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. ఆదాయంలో దేశీ టర్నోవర్‌ ఇండస్‌ టవర్స్‌ వాటాతో కలసి 23 శాతం ఎగసింది. రూ. 38,690 కోట్లను తాకింది. త్రైమాసికంగా సైతం ఆదాయం 5.4 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. ఆఫ్రికా ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 13,680 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.  

ఏఆర్‌పీయూ అప్‌ 
ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 10 శాతం మెరుగుపడి రూ. 256కు చేరింది. గత క్యూ2లో రూ. 233 మాత్రమే. ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లు 51 లక్షలమంది జత కలవగా, పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో 10 లక్షల మంది చేరినట్లు విఠల్‌ వెల్లడించారు. కాగా.. కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 11 శాతం బలపడి 62.35 కోట్లను తాకింది. దేశీ వినియోగదారుల సంఖ్య 11 శాతం పెరిగి 44.97 కోట్లకు చేరింది. పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో కస్టమర్ల సంఖ్య 2.75 కోట్లను తాకినట్లు విఠల్‌ పేర్కొన్నారు. ఒక్కో కస్టమర్‌ మొబైల్‌ డేటా వినియోగం 27 శాతం అధికంగా నెలకు 28.3 జీబీకి చేరింది. దేశీ పెట్టుబడులు రూ. 9,643 కోట్ల తో కలసి మొత్తం పెట్టుబడి వ్యయాలు రూ. 11,362 కోట్లను తాకాయి. కంపెనీ నికర రుణ భారం 5 శాతం తగ్గి రూ. 1,94,713 కోట్లుగా నమోదైంది.  
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో 1 శాతం లాభపడి రూ. 2,074 వద్ద ముగిసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)