Breaking News

పాడైన ఆహారాన్ని గుర్తించే స్మార్ట్‌సెన్స్‌

Published on Fri, 07/10/2026 - 13:51

కాయగూరలు, పాలు, పెరుగు, చికెన్‌, మటన్‌.. ఏ ఆహార పదార్థమైనా కానివ్వండి. కొనేవి తాజాగా ఉండాలని కోరుకుంటాం!. కానీ ఏది తాజాది? ఏది పాతదని తెలిసేదెలా? ప్యాకేజీపై మా స్టిక్కర్లు ఉంటే చాలు అంటోంది బయోసౌక్‌!

బెంగళూరులోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మొదలైన స్టార్టప్‌ కంపెనీ (బయోసౌక్) ఇది. స్మార్ట్‌సెన్స్‌ పేరుతో వీరు ఆహార పదార్థాల తాజాదనాన్ని గుర్తించేందుకు ఒక ప్యాకేజింగ్‌ మెటీరిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది కాగితం ఆధారంగానే తయారవుతుంది కానీ.. అమ్మోనియా, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి వాయువులను గుర్తించేందుకు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆహార పదార్థాలు పాడయ్యే క్రమంలో ఈ వాయువులనే వదులుతాయి. వాటిని గుర్తిస్తే ఆహారం ఎంత పాతదో ఇట్టే తెలిసిపోతుందన్నమాట. వాయువుల మోతాదుకు తగ్గట్టుగా ఈ ప్యాకేజింగ్‌ మెటీరియల్‌పై ఉన్న స్టిక్కర్‌పై రంగులు మారిపోతుంటాయి. ఏ రంగు ఎంత పాతదన్న విషయాన్ని సూచిస్తుంది. కోడిగుడ్లు మొదలుకొని మాంసం, సముద్ర ఉత్పత్తులు, పాలు, పెరుగు, కాయగూరల్లాంటి ఆహార పదార్థాల వరకు అన్నింటి తాజాదనాన్ని గుర్తించవచ్చు.

ఎక్స్‌పైరీ డేట్‌తో పనిలేదు
ఇప్పటివరకూ ఆహార పదార్థాల తాజాదనాన్ని గుర్తించేందుకు నిర్దిష్ట పద్దతి అంటూ ఏదీ లేదు. ఫలానా టైమ్‌లోపు వాడండి అన్న ఎక్స్‌పైరీ డేట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. లేదంటే ల్యాబ్‌లో పరీక్షించి నిర్ధారించుకోవాలి. ఫలితంగా చాలాచోట్ల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. పోస్ట్‌ హార్వెస్టింగ్‌ నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. తినే ఆహారం సురక్షితమా? కాదా? అన్న అనుమానాలూ వస్తూంటాయి.

ఈ సమస్యలన్నింటినీ స్మార్ట్‌సెన్స్‌ ప్యాకేజింగ్‌ ద్వారా అధిగమించవచ్చునని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో డాక్టర్‌ ఆదర్శ గౌడ తెలిపారు. రైతులు, ఉత్పత్తిదారులకు నష్టాలు తగ్గడమే కాకుండా.. వినియోగదారులు తగిన నిర్ణయం తీసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)