Breaking News

అదిరే గ్యాడ్జెట్స్‌.. హోమ్‌ హ్యాపీస్‌

Published on Sun, 06/29/2025 - 12:00

ఇప్పుడు ఇంట్లో పని గట్టిగా కాదు, గాడ్జెట్స్‌తో స్మార్ట్‌గా చేయండి. ఎందుకంటే పని తగ్గించి, సమయాన్ని ఆదా చేసి, సంతోషాన్ని ఇచ్చే కొన్ని హౌస్‌ గాడ్జెట్లు ఇవిగో మీ కోసం!

ఈగలకు నో ఎంట్రీ
కిటికీ తీయగానే, ఈగలు వచ్చి చుట్టూ తిరగడం కామన్‌! అలాగని, అవి చెవి దగ్గరకు వచ్చి ‘జూయ్‌.. జూయ్‌.. ’ రాగాలు వినిపిస్తూ విసిగిస్తుంటే, చేతికి గాజు వేసుకోండి. అవును, ఈ గాజు పేరు ‘వ్రోక్సీ’ ఇది చూడటానికి గాజులాగే ఉంటుంది కాని, దీని లోపల నేచురల్‌ ఆయిల్స్, ఇతర ఆయుర్వేద మూలికల వాసనలతో ఈగలకి నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. సాఫ్ట్‌ సిలికాన్‌తో ఉంటుంది కాబట్టి చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజూ వాడేలా స్టయిలిష్‌గా, తేలికగా ఉంటుంది. ఇది ఇంట్లోకి, పిక్నిక్‌కి, క్యాంపింగ్‌కి బెస్ట్‌ ఆప్షన్‌. ధర రూ. 299 మాత్రమే!

చేతులకు వెచ్చదనం
చలికాలం వచ్చిందంటే మీ చేతులు జారిపోతున్నాయా? ఇంట్లో పని చెయ్యాలన్నా, మొబైల్‌ స్క్రోల్‌ చేయాలన్నా, చేతులు తిమ్మిరితో మొద్దుబారితే ఎలా? అప్పుడు వెంటనే మీకు కావాల్సింది మామూలు రూమ్‌ హీటర్‌ కాదు, ఈ ‘ఒకూపా హ్యాండ్‌ వార్మర్‌’. ఇది చిన్న లిప్‌స్టిక్‌ సైజులో ఉంటుంది. ఇందులో రెండు చేతులకూ సరిపోయేలా రెండు మినీ హ్యాండ్‌ వార్మర్లు మాగ్నెట్‌కు అంటిపెట్టుకొని ఉంటాయి. వేరుచేసి వాడితే, రెండు చేతులకు వెచ్చదనాన్ని ఇస్తాయి. రెండింటినీ కలిపి వాడితే, చిన్న రూమ్‌ హీటర్‌లాగా కూడా పనిచేస్తుంది. అదిరే కాంబో కదా! ఒక్కసారి చార్జ్‌చేస్తే దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. ధర రూ. 3,999.

వెచ్చని కౌగిలి! 
ఇంటి పని అంతా ముగించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటే; వెన్నునొప్పులు, కాళ్ల నొప్పులు వెంటనే ‘‘హాయ్‌ సిస్టర్‌!’’ అని వచ్చేస్తాయి. నెలసరి సమయంలో ఇవి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పడే ఒక మంచి సహాయం మసాజ్‌తో కాదు, వెచ్చదనంతో కావాలి. ఆ వెచ్చదనం అందించే స్నేహితురాలే ఈ ‘హగ్‌బ్యాగ్‌’! ఇది కేవలం బొమ్మ కాదు. ఇది ఓ చిట్టి డాక్టర్‌ లాంటిది. క్యూట్‌ టాయ్‌లా కనిపిస్తుంది కాని, లోపల మాత్రం వాటర్‌ బాటిల్‌తో ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోసి, వెచ్చని చికిత్సను ఇంట్లోనే పొందొచ్చు. వంటింట్లో గంటల పాటు నిలబడి పని చేసిన తర్వాత ఇది పట్టుకొని పడుకోండి, గట్టిగా నిద్ర పడుతుంది. నెలసరి నొప్పుల నుంచి ఇది చక్కని ఉపశమనం కూడా ఇస్తుంది. ధర రూ.799 మాత్రమే!

మీ మాటే తనకు శాసనం!
చెప్పిందే పది సార్లు చెప్పినా కూడా టీవీలో మునిగిపోయిన భర్త వినడు, గేమ్స్‌లో లీనమైపోయిన పిల్లలు వినరు. ఇక అత్త మామలకైతే వాట్సాప్‌లో మెసేజ్‌ చేసినా, బ్లూటిక్‌ పడటానికి పదిరోజులు పడుతుంది. ఇలా ఇంట్లో ఎవరూ మీ మాట వినకపోయినా! ఈ ‘అలెక్సా ఎకో పాప్‌’ మాత్రం మీ మాటే శాసనంగా పాటిస్తుంది. ఎందుకంటే, ఇది అలెక్సా సరికొత్త, స్మార్ట్‌ మోడల్‌. మీకు టైమింగ్‌ గుర్తు చేస్తుంది, పాటలు పాడుతుంది, టీవీ, లైట్లు ఆన్‌, ఆఫ్‌ చేస్తుంది. అలాగే, లేటెస్ట్‌ షాపింగ్‌కు కావాల్సిన డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా చెబుతుంది. ఇది మీ ఇంట్లో ఉండాలంటే, పెద్ద కారణాలు అవసరం లేదు. కాని, ఇది ఉంటే మాత్రం మీ పనులు చకచకా చిటికెలో జరిగిపోతాయి. ఇకపై ‘మా ఇంట్లో ఎవరూ నా మాట వినరు’ అనే ఫీలింగ్‌ కూడా ఉండదు. ధర రూ. 4,499.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)