Breaking News

కొత్త టెక్నాలజీ.. డైలీ రొటీన్‌కు ఫన్ టచ్‌!

Published on Sun, 06/07/2026 - 15:50

రోజూ వాడే చిన్న చిన్న వస్తువులే ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. చూడటానికి క్యూట్‌గా, వాడటానికి సూపర్‌గా ఉండే ఈ స్మార్ట్‌ హెల్పర్స్‌తో మీ డైలీ రొటీన్‌కు ఒక ఫన్ టచ్‌ వచ్చేస్తుంది!

స్పూన్‌తో పనిలేని మగ్‌!
ఉదయాన్నే ఆఫీస్‌ హడావుడిలో కాఫీ లేదా హెల్తీ ప్రొటీన్‌ షేక్‌ కలుపుకోవడానికి స్పూన్‌ వెతుక్కునే ఓపిక లేనప్పుడు– మీ పనిని చిటికెలో సులువు చేయడానికే వచ్చేసింది ఈ ‘ఆటోమేటిక్‌ సెల్ఫ్‌ స్టిరింగ్‌ మగ్‌!’ ఇది మీ చేతిలో ఉంటే చాలు, మీరు స్పూన్‌తో తిప్పాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క బటన్‌ ప్రెస్‌తో మీ డ్రింక్‌ని పర్ఫెక్ట్‌గా మిక్స్‌ చేసేస్తుంది.

ఇందులో ఉండే అడ్వాన్డ్స్ మ్యాగ్నెటిక్‌ మిక్సింగ్‌ టెక్నాలజీ వల్ల అడుగున షుగర్‌ గానీ, ప్రొటీన్‌ పౌడర్‌ గానీ గడ్డలు కట్టకుండా స్మూత్‌గా బ్లెండ్‌ అవుతుంది. థర్మల్‌ లిడ్‌ డిజైన్‌తో రావడం వల్ల మీ డ్రింక్‌ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, పైగా ప్రయాణాల్లో వాడుతున్నా కూడా అస్సలు కింద వలకదు. ధర కేవలం రూ. 1000 మాత్రమే!

మినీ ఎయిర్‌ పంప్‌...!
సమ్మర్‌ క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు లేదా పూల్‌లో ఎంజాయ్‌ చేయాలనుకున్నప్పుడు ఎయిర్‌ బెడ్స్, స్విమ్‌ రింగ్స్‌లో నోటితో గాలి ఊదలేక ప్రాణం, ప్రాణం మీదికి వస్తోందా? మీ ఊపిరితిత్తుల కష్టాలను తీరుస్తూ, చిటికెలో గాలి నింపేయడానికి వచ్చేసింది ఈ ‘ఫ్లెక్స్‌టైల్‌గేర్‌ మ్యాక్స్‌ పంప్‌’.

కేవలం 123 గ్రాముల బరువుండే ఈ బుజ్జి గ్యాడ్జెట్‌.. ఏకంగా 5.0 కెపీఏ ప్రెజర్‌తో నిమిషానికి 500 లీటర్ల గాలిని రాకెట్‌ స్పీడ్‌తో నింపేస్తుంది. దీని డిజైన్‌కు అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే దీని లోపలి భాగాలు కనిపించేలా ట్రాన్స్‌పరెంట్‌ బాడీతో ఉండటమే కాకుండా, రాత్రి పూట క్యాంపింగ్‌లో వాడుకోవడానికి వీలుగా 3 లెవెల్స్‌ బ్రైట్‌నెస్‌ ఉన్న ఒక సూపర్‌ ఎల్‌ఈడీ క్యాంపింగ్‌ లైట్‌లా కూడా పనిచేస్తుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 60 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా చేస్తుంది. ధర రూ. ఐదు వేల నుంచి మొదలు!

చార్జర్‌ ప్రొటెక్టర్‌!
మీ చార్జర్‌ కేబుల్స్‌ త్వరగా విరిగిపోతున్నాయా? లేదా వైట్‌ కలర్‌ అడాప్టర్‌ మురికిగా అయిపోతోందని వర్రీ అవుతున్నారా? మీ చార్జర్‌ని సరికొత్తగా మారుస్తూ, దానికి లైఫ్‌ లాంగ్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వడానికి వచ్చేసింది ఈ ‘ఆస్ట్రోనాట్‌ థీమ్‌ చార్జర్‌ ప్రొటెక్టర్‌ సెట్‌!’

ఇది చార్జర్, పవర్‌ అడాప్టర్లకు పర్ఫెక్ట్‌గా సెట్‌ అయ్యే ఒక క్యూట్‌ గ్యాడ్జెట్‌. హై–క్వాలిటీ సిలికాన్‌ మెటీరియల్‌తో చేసిన ఈ కేస్, మీ చార్జింగ్‌ బ్రిక్‌ను స్క్రాచెస్‌ పడకుండా, కింద పడినా పాడవకుండా కాపాడుతుంది. ఇందులో వచ్చే బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్పైరల్‌ వ్రాప్‌ మీ కేబుల్స్‌ అస్సలు వంగిపోకుండా, చిరిగిపోకుండా రక్షణ ఇస్తుంది. అంతేకాదు, ట్రావెలింగ్‌లో కేబుల్స్‌ చిక్కుపడిపోకుండా నీట్‌గా ఫోల్డ్‌ చేసుకోవడానికి ఇందులో ఒక ఆర్గనైజింగ్‌ స్ట్రాప్‌ కూడా వస్తుంది. దీని ధర రూ. 170 మాత్రమే!

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)