Breaking News

ఫిబ్రవరిలో క్రెడిట్‌ కార్డుల జారీ ఎలా ఉందంటే..

Published on Mon, 03/31/2025 - 15:34

దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు జారీ చేసే క్రెడిట్‌ కార్డుల వృద్ధి ఫిబ్రవరిలో మందగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో సహా ప్రముఖ ఆర్థిక సంస్థలు కొత్తగా జారీ చేసే కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల​్‌ బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డుల జారీ తగ్గిపోయిందని ఆర్‌బీఐ తెలిపింది.

భారతదేశ క్రెడిట్ కార్డ్ విభాగంలో అధికంగా వినియోగదారులున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిబ్రవరిలో 1,78,000 కార్డులను జోడించింది. దాంతో మొత్తం కార్డుల సంఖ్య 23.6 మిలియన్ల(2.36 కోట్లు)కు చేరంది. ఇది దేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసినప్పటికీ, వృద్ధి గత నెలతో పోలిస్తే క్షీణించింది. జనవరిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3,00,000 కొత్త కార్డులను జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన కార్డుల కంటే జనవరిలో ఇష్యూ చేసిన కార్డులు చాలా ఎక్కువ. ఎస్‌బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా ఫిబ్రవరిలో మందకొడిగానే కార్డులను జారీ చేశాయి. ఆర్‌బీఐ డేటాలో సదరు బ్యాంకుల నెలవారీ కార్డుల చేర్పులకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు వివరించనప్పటికీ రెండు సంస్థలు గతంలో కంటే తక్కువ కార్డులనే జోడించాయని పేర్కొంది.

ఇదీ చదవండి: కొత్త లోన్‌ రూల్‌.. రేపటి నుంచే..

కార్డుల జారీ మందగించడానికి కారణాలు..

దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులతో సహా అన్‌సెక్యూర్డ్‌ రుణాలు పెరుగుతుండడంపై ఆర్‌బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఇది బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమైంది. దాంతో కార్డుల సంఖ్య తగ్గిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రొవిజనింగ్ అవసరాలు లేదా కఠినమైన నో-యువర్-కస్టమర్ (కేవైసీ) నిబంధనలు వంటి నియంత్రణ చర్యలు కూడా కార్డుల జారీని ప్రభావితం చేసిందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, విచక్షణా వ్యయం(డిసిక్రీషనరీ స్పెండింగ్‌)లో మందగమనం వంటి ఆర్థిక ప్రతికూలతలు కూడా కార్డుల వినియోగాన్ని తగ్గిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి