Breaking News

భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు

Published on Mon, 05/27/2024 - 15:52

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్‌లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్‌ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.

స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్‌బ్యాక్‌ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)