Breaking News

తిరిగొచ్చిన ఆక్టేవియా ఆర్ఎస్.. రూ.6 లక్షలు పెరిగిన ధర!

Published on Sun, 09/06/2026 - 08:43

స్కోడా తన ఆక్టేవియా ఆర్ఎస్ కారును మరోమారు.. భారతదేశంలో అమ్మకానికి పెట్టింది. అయితే ఈసారి దీని ధర రూ.56.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రారంభంలో దీని ధర రూ.49.99 లక్షల వద్ద ఉండేది. ఇప్పుడు రెండో బ్యాచ్ రేటు రూ.6.70 లక్షలు ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్కోడా మొదటి విడతలో 100 యూనిట్ల ఆక్టేవియాలను మాత్రమే పరిమితం చేసింది. గత సంవత్సరం ఈ కారు భారతదేశంలోకి అడుగుపెట్టక ముందే అమ్ముడైపోయింది. ఇప్పుడు కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఈ బ్యాచ్ మరింత పరిమితమైంది. వచ్చే వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఆక్టేవియా ఆర్ఎస్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. వోక్స్‌వ్యాగన్ తన గోల్ఫ్ జీటీఐలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. అయితే ఆక్టేవియా RS దాని ఇండియా-స్పెక్ కాన్ఫిగరేషన్‌లో 265 bhp మరియు 370 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ శక్తిని కేవలం ముందు చక్రాలకు మాత్రమే పంపుతుంది. ఈ సెడాన్ 6.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, అలాగే గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని స్కోడా పేర్కొంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ 13-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 11-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారులో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన హీటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది.

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)