Breaking News

ఫుల్ ఛార్జ్‌పై 440 KM రేంజ్.. స్కోడా కొత్త కారు!

Published on Sun, 10/18/2026 - 14:38

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా 2026 పారిస్ మోటార్ షోలో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎపిక్ స్పోర్ట్‌లైన్‌ను పరిచయం చేసింది. ఈ కారుకు స్పోర్టీ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్లాక్ రూఫ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, ప్రత్యేకమైన ఫ్రంట్ గ్రిల్ ఈ కారుకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

కారు లోపలి భాగంలో బ్లాక్ కలర్ థీమ్, సౌకర్యవంతమైన సీట్లు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా.. స్పోర్టీ లుక్‌తో పాటు ప్రీమియం అనుభూతిని అందించేలా ఇంటీరియర్‌ను రూపొందించారు.

ఈ కారు రెండు వెర్షన్లలో (ఎపిక్ 40, ఎపిక్ 55) అందుబాటులో ఉంటుంది. ఎపిక్ 40లో 37 kWh బ్యాటరీ ద్వారా.. 310 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఎపిక్ 55లోని 55 kWh బ్యాటరీ.. 440 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ వెర్షన్ 207 bhp పవర్‌ను అందిస్తూ, కేవలం 7.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

అయితే.. స్కోడా ఎపిక్ స్పోర్ట్‌లైన్‌ను భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ కారును స్థానికంగా తయారు చేయడం, తగిన ధరతో అందుబాటులో ఉంచడం, ప్రభుత్వ సబ్సిడీలు మొదలైన అంశాలను పరిశీలిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)