Breaking News

మూడేళ్లలో ఆరు లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌.. 

Published on Tue, 07/15/2025 - 02:05

మూడేళ్ల వ్యవధిలో దాదాపు ఆరు లక్షల గ్రామాల్లో హై–స్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సీఐఐ–జీసీసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ తెలిపారు. జీసీసీలు ప్రస్తుతం ఎక్కువగా పెద్ద నగరాలకే పరిమితమవుతున్నాయని, కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా చార్జీలు అత్యంత తక్కువగా ఉండటమనేది, జీసీసీల ఏర్పాటుకు ఎంతో ప్రయోజనకరమైన అంశమని వివరించారు. 

అలాగే, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన నిపుణుల లభ్యత, కనెక్టివిటీ, కొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలు, మేథోహక్కుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాలు మొదలైనవన్నీ భారత్‌కు సానుకూలాంశాలని పేర్కొన్నారు. దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌ సగటున 138 ఎంబీపీఎస్‌గా ఉంటోందని మిట్టల్‌ చెప్పారు. అదనంగా మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడం, పరిశోధనలు .. అభివృద్ధి కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, చిన్న..మధ్య తరహా సంస్థలు అలాగే స్టార్టప్‌లను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనితో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించినప్పుడు జీసీసీలకు డిజిటల్‌ మౌలిక సదుపాయాల కొరత ఉండదని మిట్టల్‌ తెలిపారు.  

Videos

సీఎంను చంపేసిన Facebook

కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!

హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు

జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...

మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్

వణికిన మహానగరం

Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి

నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

YSR జిల్లా బద్వేల్‌లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా

Photos

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)