Breaking News

సాపిజెన్ బయోలాజిక్స్‌లో సింగపూర్ అధ్యక్షుడు

Published on Sat, 01/18/2025 - 21:19

సింగపూర్ అధ్యక్షుడు 'థర్మన్ షణ్ముగరత్నం' భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగానే భువనేశ్వర్‌లోని అంధరువాలోని ఒడిశా బయోటెక్ పార్క్‌లో భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్దదిదైన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ సాపిజెన్ బయోలాజిక్స్‌ను సందర్శించారు. ఆయనతో పాటు మంత్రివర్గ నాయకులు, వ్యాపార వేత్తలు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.

భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా.. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాచెస్ ఎల్లా, డైరెక్టర్ డాక్టర్ జలచారి ఎల్లా, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ థర్మన్ షణ్ముగరత్నంను స్వాగతించారు.

సింగపూర్ అధ్యక్షులు వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సందర్శించడం మాకు చాలా గౌరవంగా ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ విశాలమైన మల్టీ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతున్న వినూత్న పనిని ప్రదర్శించడానికి మేము గర్విస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో పాటు వారి బృందాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రూ. 1500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ 10 వేర్వేరు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సదుపాయం ద్వారా 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు & 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)